పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ ప్రత్యేక బస్సు

పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ ప్రత్యేక బస్సు

SKLM: కార్తీక మాసం నేపథ్యంలో ఆదివారం శ్రీకాకుళం ప్రజా రవాణా కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. వన్ డిపో మేనేజర్ హనుమంతు సమరసింహుడు పచ్చజెండాలను ఊపి బస్సు ప్రారంభించారు. సోమవారం భక్తులు దర్శనార్థమై రిజర్వేషన్ చేసుకున్న మేరకు బస్సు పంపించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ డిపో మేనేజర్ శర్మ, కాంప్లెక్స్ మేనేజర్ ఎంపీ రావు, స్టేషన్ మేనేజర్లు పాల్గొన్నారు.