పీ-4 సర్వేను తనిఖీ చేసిన ఎంపీడీవో

VZM: బొబ్బిలి ఎంపీడీవో పి. రవికుమార్ గురువారం స్దానిక కోమటిపల్లిలో జరుగుతున్న పీ-4 నీడ్ అసెస్మెంట్ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను ఆరా తీశారు. సర్వే సక్రమంగా నిర్వహించాలని, పేదలను బంగారు కుటుంబాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పీ-4 సర్వేలో తప్పులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.