జిల్లాలో వైద్యం అందక ప్రజల అవస్థలు
నెల్లూరు జిల్లాలో 104 వాహన సేవలు నామమాత్రంగా మారాయి. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో గ్రామీణ వైద్యం కుంటుపడింది. ఈ నెలలో సగం మంది గర్భిణులకే పరీక్షలు చేయగా.. క్యాన్సర్, బీపీ, షుగర్ రోగులను గాలికి వదిలేశారు. వేలల్లో టీబీ బాధితులున్నా కేవలం ఐదుగురికే సేవలందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో సుజాత హెచ్చరించారు.