GOOD NEWS: తగ్గిన ధరలు

GOOD NEWS: తగ్గిన ధరలు

వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర తగ్గింది. 19 కేజీల LPG సిలిండర్ ధరను రూ.24 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1723.50కు చేరింది. ఈ తగ్గింపు ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.