రేణు అగర్వాల్ హత్య.. కొవ్వొత్తుల ర్యాలీ

రేణు అగర్వాల్ హత్య.. కొవ్వొత్తుల ర్యాలీ

MDCL: కూకట్ పల్లిలో హత్యకు గురైన రేణు అగర్వాల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానికులు మాట్లాడుతూ.. రేణు అగర్వాల్ హత్య నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ శాంతియుతంగా ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. రేణు అగర్వాల్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.