మెప్మా సీవో సూరిబాబుకు ఉత్తమ పురస్కారం
కోనసీమ: రామచంద్రపురంలో విధులు నిర్వహిస్తున్న గుబ్బల సూరిబాబుకు ఉత్తమ కమ్యూనిటీ ఆర్గనైజర్ అవార్డు దక్కింది. సోమవారం కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా మెప్మా పీడీ పెంచలయ్య నుంచి ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విశేష సేవలు అందించినందుకు ఈ గౌరవం లభించింది.