'అక్రమ గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవాలి'
KNR: సైదాపూర్‌లో అక్రమ గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి లంకదాసరి కల్యాణ్ డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. అధికారుల అండతో వ్యాపారులు పన్నులు ఎగవేస్తూ, పరిమితికి మించి తవ్వకాలు చేస్తున్నారని, ఓవర్ లోడ్ రవాణాతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, క్వారీల దుమ్ముతో పంటలు దెబ్బతింటున్నాయన్నారు.