అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలి: రూరల్ ఎమ్మెల్యే
NZB: స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలని, అది కాంగ్రెస్ నాయకులతోనే సాధ్యమవుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. ఆదివారం ధర్పల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.