కథలాపూర్‌లో బీజేపీ సేవాపక్షం కార్యశాల నిర్వహణ

కథలాపూర్‌లో బీజేపీ సేవాపక్షం కార్యశాల నిర్వహణ

జగిత్యాల: కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల అధ్యక్షుడు మల్యాల మారుతి అధ్యక్షతన సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో లింగంపల్లి శంకర్, గోపాల్ రెడ్డి, గాంధారి శ్రీనివాస్ పాల్గొన్నారు.