మాజీ ఎంపీపీ చిరంజీవి పై పీడీ యాక్ట్ కేసు కొట్టివేత
SKLM: ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ మొదల వలస చిరంజీవి శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 15న పీడీ యాక్ట్ పై అరెస్ట్ అయ్యారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.హైకోర్టు పీడీ యాక్ట్ కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది అని స్థానిక ఎస్ఐ చిరంజీవి తెలిపారు.