చిలుకానగర్, చెంగిచెర్ల రోడ్లకు మహార్దశ..!

MDCL: బోడుప్పల్ ప్రజలకు రోడ్ల సౌకర్యం మరింత మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్నట్లు మాజీ మేయర్ అజయ్ యాదవ్ తెలిపారు. HMDA ద్వారా చెంగిచెర్ల రహదారికి రూ.9.85 కోట్లు, చిలుకానగర్ రహదారికి రూ.9.75 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. రోడ్లకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, పనుల్లో వేగం పెంచేలా ఒత్తిడి తెస్తామన్నారు.