భీమవరం-కాళీపట్నం రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు
W.G: రోడ్డు అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ రోజు నుంచి మే 2 వరకు భీమవరం-కాళీపట్నం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. వాహనాలను దిరుసుమర్రు, రామాయణపురం మీదుగా మళ్లించారు. నెల రోజుల పాటు అమల్లో ఉండే ఈ మార్పును గమనించి ప్రయాణికులు సహకరించాలని కోరారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.