రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయాలు

CTR: రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తకు గాయాలైన ఘటన గుర్రంకొండ మండలంలో జరిగింది. ఎస్ఐ మధు రామచంద్రుడు వివరాల మేరకు..చిన్నమండ్యం (M) కేసాపురానికి చెందిన లక్ష్మీదేవి, శివశంకరయ్య బైకుపై గుర్రంకొండ వైపు వచ్చారు. ఈక్రమంలో చిట్టిబోయినపల్లి వద్ద ఆదివారం వాళ్ల బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ దంపతులను గుర్రంకొండ ఆసుపత్రికి తరలించారు.