కడపకు చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు
KDP: జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రునికి విమానాశ్రయంలో సోమవారం ఘన స్వాగతం లభించింది. టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోట్లదుర్తిలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ స్వగృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎంపీ సీఎం రమేశ్ మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.