ఉగ్రదాడికి వ్యతిరేకంగా ర్యాలీ

SKLM: పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రజా వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. ఏడు రోడ్లు జంక్షన్ నుంచి కోడి రామ్మూర్తి స్టేడియం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఉగ్రవాదం నశించాలి, మతసామరస్యం వర్ధిల్లాలి, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నాయకులు శ్రీనివాస్, డా. సుధీర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.