ఈనెల 12న కరీంనగర్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు
KNR: కరీంనగర్ -2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు ఆర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. 12న కరీంనగర్ బస్టాండ్ నుంచి సా.8 గం.కు బయలుదేరి, 13న పాపికొండలు బోటింగ్, అదే రోజు రాత్రి భద్రాచలం చేరుకుంటారు. 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వస్తుందన్నారు.