టీజీపీలో 3,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం

NDL: చాగలమర్రి మండలంలోని టీజీపీ ప్రధాన కాలువలో 3,600 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు టీజీపీ డీఈ వెంకటరమణ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లోని వివిధ గ్రామాలలో టీజీపీ ప్రధాన కాలువ ద్వారా 46 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అన్నదాతలు సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.