పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

ADB: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్ షోలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.