దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

WGL: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మంచి ధర పొందాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.