అమెరికాలో భారత సంతతి మిలియనీర్‌ అరెస్టు

అమెరికాలో భారత సంతతి మిలియనీర్‌ అరెస్టు

అమెరికాలో భారత సంతతికి చెందిన మిలియనీర్ విక్రమ్ బేరి అరెస్ట్ అయ్యాడు. కాలిఫోర్నియాలోని సారాటోగాలో ఉన్న ఓ వైన్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిపైకి వైన్ బాటిల్స్ విసిరి.. అక్కడి నుంచి పారిపోతూ మరో రెండు కార్లను ఢీకొట్టాడు. బేరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.