'యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి'
NLG: రేవంత్ సర్కార్ అమల్లోకి తెచ్చిన యూరియా యాప్‌ను రైతు ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసినట్లు తెలిపారు.