గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో భోజనం చేసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మెనూనుపై సమీక్ష చేశారు. సిబ్బందిని డైట్ మెనూను కట్టుదిట్టంగా అమలు చేయమని, పాఠశాలలో చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.