'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

అన్నమయ్య: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాయచోటితో సహా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా బుధవారం "నషా ముక్త్ భారత్ అభియాన్" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయం లేదా వినియోగంపై సమాచారం వెంటనే టోల్ ఫ్రీ 1972కు తెలియజేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.