రామప్పలో పర్యాటకుల సందడి

రామప్పలో పర్యాటకుల సందడి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. సెలవుదినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్శకులు రామప్ప చెరువు వద్ద ఫొటోలు దిగారు.