వ్యవసాయ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్ష
MBNR: కలెక్టరేట్‌లో విత్తనాల విక్రయదారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులతో నిన్న కలెక్టర్ ఖుష్భూ గుప్తా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ, నాణ్యత లేని, గడువు ముగిసిన విత్తనాల విక్రయాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు నిబంధనల పాటించాలన్నారు. ప్రతి మండలంలో టాస్క్ ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడతామని సూచించారు.