రామయ్య సేవలో ఎచ్చెర్ల ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలంలోని భగీరధ పురం పంచాయతీ వీరవలస గ్రామంలో రామయ్య తండ్రి సంబరాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి హాజరయ్యారు. అనంతరం ఆయన అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.