'హర్షవీణపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలి'

'హర్షవీణపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలి'

AP: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఎస్సీ మహిళలకు అన్యాయం జరిగితే చర్యలు లేవని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సూచించారు.