VIDEO: వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా 21న భారీ ర్యాలీ

ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా ఈనెల 21న కనిగిరిలో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు జమీయాత్ ఉలేమా హింద్, అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ నాయకులు తెలిపారు. గురువారం కనిగిరిలోని షాది ఖానాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంజుమన్ కమిటీ మాజీ అధ్యక్షులు సంధాని మాట్లాడుతూ.. రాజ్యాంగ మౌలిక విరుద్ధంగా కేంద్రం సవరణ చట్టం తెస్తుందన్నారు.