ట్రయంఫ్ రికార్డు.. లక్ష దాటిన సేల్స్
బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యం 2.5 ఏళ్లలోనే లక్ష బైకుల సేల్స్ మైలురాయిని దాటింది. ఇందులో దేశీయ అమ్మకాలతో పాటు 18 దేశాలకు చేసిన ఎగుమతులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 200 నగరాల్లో 230 డీలర్‌షిప్‌లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఏప్రిల్ నాటికి తక్కువ ధరలో 350cc మోడళ్లను లాంచ్ చేయనుంది. వీటికి 18% GST మాత్రమే వర్తించనుండటంతో మార్కెట్లో గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.