'మెనూ ప్రకారం భోజనం తప్పనిసరి'
ASR: చింతపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా కమిటీ వైస్ చైర్మన్ వేములపూడి పరమేశ్వరావు సోమవారం తనిఖీ చేశారు. వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం నాణ్యంగా అందించాలని, ఆహారం వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.