ఈవోఆర్డీగా సుధాకర్ బాధ్యతలు స్వీకరణ
సత్యసాయి: రొళ్ల మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఈవోఆర్డీగా సుధాకర్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ మాట్లాడుతూ.. మండలంలో పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.