'తృప్తి క్యాంటిన్స్ పై అసంతృప్తి

'తృప్తి క్యాంటిన్స్ పై అసంతృప్తి

VSP: రామకృష్ణ బీచ్ సముద్రతీరంలో మహిళల స్వయం సహాయక సంఘాల కోసం జీవీఎంసీ యూసీడీ విభాగం ఇటీవల “తృప్తి క్యాంటిన్” పేరుతో ఓ పెద్ద కంటైనర్ దుకాణానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ క్యాంటిన్‌ వివాదాస్పదమైంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్థానికులు ఆందోళనకు దిగారు.