సేఫ్‌గార్డ్ బాయ్స్‌ను నియమించాలి: బీసీ జనార్థన్
AP: కార్తీకమాసం వంటి ప్రత్యేక సందర్భాల్లో బీచ్‌ల వద్దకు భారీగా తరలివచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సేఫ్‌గార్డ్ బాయ్స్‌ను నియమించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. మంగళగిరిలో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. తుఫాన్‌తో నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు.