VIDEO: వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు గురువారం వివిధ ప్రాంతాలలో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. రోడ్లపై వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడకుండా అన్ని డివిజన్లలో సంబంధిత విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.