'తిరుమల లడ్డూ కల్తీ విషయం పై CBI దర్యాప్తు చేయాలి'

E.G: తిరుమల లడ్డూ కల్తీ విషయంపై CBI దర్యాప్తు చేయాలంటూ వైసీపీ నాయకుల దీక్షలు చేపట్టారు. కోనసీమ జిల్లా బండారులంకలో వైసీపీ నేతల దీక్షకు దిగారు. చంద్రబాబు నీచ రాజకీయాలు ప్రపంచానికి తెలిసాయని వైసీపీ నాయకులు అన్నారు. దీక్షకు మద్దతుగా నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, మట్టపర్తి నాగేంద్ర, గోవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు పాల్గొన్నారు.