ప్రకాశం బ్యారేజ్‌కి పెరుగుతున్న వరద

ప్రకాశం బ్యారేజ్‌కి పెరుగుతున్న వరద

GNTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం ఉదయానికి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొంది. కృష్ణా నదీ పరివాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.