మద్యం సీసాలు స్వాధీనం.. వ్యక్తిపై కేసు నమోదు
VZM: గజపతినగరంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జె.జనార్దనరావు ఆధ్వర్యంలో సోమవారం పలు అనుమానిత ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. సంత తోటలో 10 మద్యం సీసాలతో బ్రహ్మం పట్టుబడడంతో కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్సై నరేంద్రకుమార్, హెచ్‌సీలు భాషా, రాజు, కానిస్టేబుల్ అప్పారావు పాల్గొన్నారు.