స్టేజీపైనే కుప్పకూలిన రష్యా రోబో
రష్యా రూపొందించిన తొలి హ్యూమనాయిడ్ రోబో వేదికపైనే కుప్పకూలి నిర్వాహకులకు షాక్ ఇచ్చింది. AI ఆధారంగా రూపొందించిన ఈ రోబోకు AIDOL(ఐడాల్) అని నామకరణం చేశారు. మాస్కోలో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో వేదికపైకి వచ్చిన ఐడాల్ సంగీతానికి అనుగుణంగా చేతులు ఊపుతూ నడిచింది. అయితే కొద్ది సెకన్లకే కుప్పకూలింది. దీంతో నిర్వాహకులు వెంటనే తెరను కప్పేసి, రోబోను తీసుకెళ్లారు.