స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహణ
NLR: విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది పార్లపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లపల్లి గ్రామంలో బుధవారం ఉచిత వైద్య పరీక్షల క్యాంపును నిర్వహించారు. ఓ హాస్పిటల్ సహాయంతో స్థానికులకు దాదాపుగా 50 మందికి పైగా గ్రామ ప్రజలను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చి ఉచిత మందులు పంపిణీ చేశారు.