నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: రాజమండ్రి సిటీ మల్లయ్య పేట సబ్ స్టేషన్ పరిధిలో కొత్త లైన్ల పనుల కారణంగా సోమవారం ఉ. 9గం.ల నుంచి మ. 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా ఆనంద్ నగర్, ఏపీపీఎమ్ క్వార్టర్స్, ఏపీపీఎమ్ సొసైటీ ప్రాంతం, రామకృష్ణ నగర్, ఇందిరానగర్, శానిటోరియం, రామదాసు పేట, వెంకటాపురం ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు.