కలెక్టరేట్ ఎదుట ఆందోళన

KKD: కేంద్ర ప్రభుత్వం 8వ, రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ నియమించాలని కేంద్ర, రాష్ట్ర పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. తమ డిమాండ్‌ల సాధన కోసం మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సంఘం సలహాదారుడు రామారాయుడు పాల్గొని మాట్లాడారు. డీఏ బకాయిలు ఇవ్వాలని, ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.