లక్ష దీపారాధనకు మంత్రికి ఆహ్వానం
సత్యసాయి: పరిగి మండలంలోని బీరలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 17న లక్ష దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రి సవితను ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఆహ్వానించారు. కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని మంత్రి కొనియాడారు.