VIDEO: 'పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

WNP: బహుజనుల హక్కులకై పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అదనపు కలెక్టర్ కిమ్య నాయక్ కొనియాడారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ఆయన జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొఘల్ రాజులతో పోరాడి, బహుజనులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.