రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ: నాదెండ్ల

GNTR: రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సమయంలో 5.65 లక్షల మంది రైతుల నుంచి సుమారు 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రూ.8,277 కోట్లను 24 గంటల్లో ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. రబీ పంట కొనుగోళ్లలో 1.16లక్షల మందికి పైగా రైతుల నుంచి 12.38 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.