సాయిబాబా దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

సాయిబాబా దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

BHNG: వలిగొండ మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం నూతన కమిటీ ఎన్నిక, ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఈ ఎన్నికలో గౌరీశెట్టి అశోక్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా సోమనబోయిన సతీష్, ఉపాధ్యక్షులుగా బోళ్ల రామచంద్రయ్య, పోకల రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంజాల రమేష్, కోశాధికారిగా చీకటిమల్ల వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా గజ్జల అమరేందర్ ఎన్నికయ్యారు.