అంతరిక్షంలో స్నానం.. శుభాంషు శుక్లా వివరణ

అంతరిక్షంలో స్నానం.. శుభాంషు శుక్లా వివరణ

అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా శుభ్రం చేసుకుంటారో భారత వ్యోమగామి శుభాంషు శుక్లా వివరించారు. అక్కడ షవర్లు ఉండవని, షాంపూతో కూడిన ప్రత్యేక వాష్‌క్లాత్ బ్యాగ్‌ను ఉపయోగిస్తామని తెలిపారు. 'కొద్దిగా నీటిని కలిపి ఆ క్లాత్‌తో ఒంటిని తుడుచుకుంటారు. అనంతరం ఆ తడి టవల్ నుంచి వచ్చే తేమను రీసైకిల్ చేసి.. 90% వరకు నీటిని తిరిగి త్రాగడానికి, ఇతర అవసరాలకు వాడుతారు' అని చెప్పారు.