కొనుగోలు కేంద్రం కావాలని డిమాండ్

ప్రకాశం: గిద్దలూరు కేంద్రంగా పొగాకు కొనుగోలు కేంద్రం కావాలని కొమరోలు, రాచర్ల, గిద్దలూరు మండలాల పొగాకు రైతులు అధికారులను డిమాండ్ చేసారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట వేసి నష్టపోయినట్లుగా రైతులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్లే సకాలంలో పొగాకు అమ్ముకోలేక నష్టపోయామని రైతు తెలిపారు.