భారత ప్రజలకు ధన్యవాదాలు: ఇరాన్
భారత ప్రజల నుంచి తమకు వైద్యసాయం అందినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీకి తొలి విడతగా ఔషధాలు, వైద్య పరికరాలు అందినట్లు భారత్‌లోని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. తమ విజ్ఞప్తి మేరకు సహాయం అందించినందుకు, యుద్ధ సమయంలో అండగా నిలిచారని భారత ప్రజలకు ఆ దేశ రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. కాగా, పశ్చిమాసియా యుద్ధంలో వందల సంఖ్యలో ఇరాన్ ప్రజలు మృతిచెందారు.