రోడ్డు ప్రమాదంలో మహిళా ఉద్యోగి మృతి
KDP: తొండూరు రెవిన్యూ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కుమారి (39)రోడ్డు ప్రమాదానికి గురై సోమవారం మృతి చెందింది. ఈమె ఇంటికి వెళ్లేందుకు ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె కింద పడగా వెనుక వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ముగ్గరు పిల్లలు ఉన్నారు.