లక్ష్మీ నరసింహ స్వామికి వైభవంగా పల్లకి సేవ
ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వాతి నక్షత్రం సందర్భంగా పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.